నీళ్లనుకుని లైజాల్‌ తాగి...

Women Dies After Mistakenly Drinking Lizol Near Tenali - Sakshi

సాక్షి, తెనాలి: నీళ్లనుకుని లైజాల్‌ (యాసిడ్‌) తాగి మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అమృతలూరు మండలం మూల్పూరుకు చెందిన జంపాని అక్కమ్మ (50) పదేళ్ల కిందట భర్త చనిపోవడంతో, తెనాలి మండలం అంగలకుదురులోని చెల్లి వెంకటేశ్వరమ్మ వద్ద ఉంటోంది.

మానసిక రుగ్మతతో బాధపడే ఆమె ఇళ్లలో పనులకు వెళ్తుంటుంది. ఒంట్లో నలతగా ఉండడంతో రెండు రోజులుగా ఇంటి వద్దే ఉంటోంది. తాగునీరనుకుని ఫ్లోర్‌ను కడిగేందుకు వాడే లైజాల్‌ను తాగింది. వాంతులు చేసుకుంటుండడంతో  కుటుంబసభ్యులు గమనించారు. తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top