breaking news
tenali govt hospital
-
నీళ్లనుకుని లైజాల్ తాగి...
సాక్షి, తెనాలి: నీళ్లనుకుని లైజాల్ (యాసిడ్) తాగి మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అమృతలూరు మండలం మూల్పూరుకు చెందిన జంపాని అక్కమ్మ (50) పదేళ్ల కిందట భర్త చనిపోవడంతో, తెనాలి మండలం అంగలకుదురులోని చెల్లి వెంకటేశ్వరమ్మ వద్ద ఉంటోంది. మానసిక రుగ్మతతో బాధపడే ఆమె ఇళ్లలో పనులకు వెళ్తుంటుంది. ఒంట్లో నలతగా ఉండడంతో రెండు రోజులుగా ఇంటి వద్దే ఉంటోంది. తాగునీరనుకుని ఫ్లోర్‌ను కడిగేందుకు వాడే లైజాల్‌ను తాగింది. వాంతులు చేసుకుంటుండడంతో కుటుంబసభ్యులు గమనించారు. తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
టాటాఏస్ బోల్తా.. 15 మందికి గాయాలు
దుగ్గిరాల(గుంటూరు): దుగ్గిరాల మండలం పెనుమూలి, నంబుర్రి గ్రామాల మధ్యలో ప్రమాదవశాత్తూ ఓ టాటాఏస్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా..మరో పది మందికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.