
అమెను నిలదీయడంతో పాటు అనుమానం వ్యక్తం చేయడంతో మనస్తాపానికి గురైన సమీన
చిలకలగూడ : హెయిర్ డై వేసుకోవద్దన్నందుకు మనస్తాపానికి లోనైన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హన్మకొండ ఖాజీపేటకు చెందిన ఎస్‌కే సమీన (28) ఒమర్ భార్యభర్తలు. వీరికి నలుగురు కుమారులు. ఏడాదిన్నర క్రితం నగరానికి వలస వచ్చి చిలకలగూడ చింతబావిలో ఉంటున్నారు. జుత్తులో తెల్లవెంట్రుకలు కనిపించడంతో సమీర ఈనెల 8న హెయిర్‌డై వేసుకుంది. దీనిని గుర్తించిన ఒమర్ అమెను నిలదీయడంతో పాటు అనుమానం వ్యక్తం చేయడంతో మనస్తాపానికి గురైన సమీన ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కేకలు విన్న స్థానికులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో సమీన గాంధీ ఆస్పత్రి బరŠన్స్‌వార్డులో చికిత్స పొందుతోంది. బాధితురాలలి నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.