భర్తకు తెలియకుండా అప్పులు.. ఆపై సొంతింట్లోనే.. | Woman Steals Cash Jewellery From Her House In Mumbai | Sakshi
Sakshi News home page

భర్తకు తెలియకుండా అప్పులు.. ఆపై సొంతింట్లోనే..

Jun 22 2020 1:05 PM | Updated on Jun 22 2020 1:13 PM

Woman Steals Cash Jewellery From Her House In Mumbai - Sakshi

ముంబై: సొంత ఇంట్లోనే చోరీకి పాల్పడిందో మహిళ. వివరాల్లోకెళ్తే.. నావీ ముంబైలోని కోపర్‌ ఖైరానే ప్రాంతంలో భార్యా, భర్తలు నివసిస్తున్నారు. అయితే భర్తకు తెలియకుండా తన జల్సాలకు కొన్నిచోట్ల అప్పులు చేసింది. తిరిగి ఆ సొమ్ము చెల్లించాల్సి రావడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడి అడ్డంగా దొరికిపోయింది. లక్షా పదివేల రూపాయల విలువైన బంగారంతో పాటు, మరో 3 లక్షల రూపాయల నగదును ఇంటి నుంచి దొంగలించింది.

కాగా.. జూన్‌ 15న ఆ మహిళ తనకు ఆరోగ్యం బాగోలేదంటూ భర్తకి చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అయితే మరోసారి ఆస్పత్రికి రమ్మని డాక్టర్లు సూచించడంతో అదే రోజు రాత్రి ఆస్పత్రికి సమీపంలో ఉ‍న్న బంధువుల ఇంటి వద్ద ఆమెను వదిలేసి వచ్చాడు. జూన్‌ 17న మరోసారి భార్యను తీసుకొని ఆస్పత్రికి వెళ్లిన అతను చికిత్సం అనంతరం ఆమెను బంధువల ఇంటివద్ద ఉంచి ఆ వ్యక్తి పనికి వెళ్లాడు. అయితే సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పని ముగించుకొని భార్యను తీసుకొని ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి ప్రవేశించగానే కిటికీలు పగలగొట్టి ఉండటం.. ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చదవండి: ‘అమ్మ’మ్మలే హతమార్చారు..

కేసుకు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా సీసీటీవీ పుటేజీని పరిశీలించి ఇరుగుపొరుగు వారిని విచారించారు. అయితే పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. కాగా.. బాధితుడి భార్య ఇచ్చిన వాంగ్మూలంపై పోలీసులు లోతుగా విచారణ జరిపారు. విచారణలో ఆమె దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. తన భర్త పనికి వెళ్లిన సమయంలో ఇంట్లోని విలువైన వస్తువులు, నగదును ఆమే ఎత్తుకెళ్లినట్లు అంగీకరించింది. అయితే ఈ ఘటనపై ఆమె భర్త మాట్లాడటానికి నిరాకరించారు. 
చదవండి: అక్కా.. నాకు బతకాలని లేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement