కీచకుడి బెదిరింపు.. రమ్య ఆత్మహత్యాయత్నం | Woman Pours Kerosene On Self Sets Fire In Nizamabad | Sakshi
Sakshi News home page

కీచకుడి బెదిరింపు.. రమ్య ఆత్మహత్యాయత్నం

May 28 2018 3:19 PM | Updated on Nov 6 2018 8:16 PM

Woman Pours Kerosene On Self Sets Fire In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్ : గతంలో సన్నిహితంగా ఉన్న ఫొటోలు నెట్‌లో పెడతానంటూ బెదిరింపులు రావడంతో యువతి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటిచుకున్న సంఘటన మాక్లూర్‌ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మాక్లూరుకు చెందిన రమ్యకృష్ణ బీటెక్‌ చదువుతోంది.

ప్రసాద్‌ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఉంది. ప్రసాద్‌ వృత్తి రీత్యా కువైట్‌లో స్థిరపడ్డాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, చదువు పూర్తి కావొస్తున్న రమ్యకృష్ణకు ఇంట్లో వివాహా సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్‌ పెళ్లికి ఒప్పుకుంటే గతంలో దిగిన ఫొటోలు నెట్‌లో పెడతానంటూ రమ్యను బెదిరించాడు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమ్యకృష్ణ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని, నిప్పంటిచుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమె శరీరం పూర్తిగా కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, రమ్యకృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి వద్ద స్టేట్‌మెంట్‌ నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement