ప్రేమ పంచాయితీ: యువతి ఆత్మహత్య

 woman commits suicide in anantapur district - Sakshi

సాక్షి, ధర్మవరం: ప్రేమికుల మధ్య జరిగిన పంచాయితీ ఓ యువతి ప్రాణాలు పోయేలా చేసింది. ఈ విషాద సంఘటన అనంతపురం జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లాలోని బత్తలపల్లి గ్రామానికి చెందిన నస్రీన్‌ అనే యువతి పోలీస్‌ స్టేషన్‌ లో ఆత్మహత్యకు యత్నించింది. ఓ యవకుడు తనను ప్రేమించి మోసం చేశాడని పోలీస్ట్‌ స్టేషన్‌లోనే విష గుళికలు మింగింది.

దీంతో పోలీసులు హుటాహుటిన ఆమెను ఆర్‌డీటీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నస్రీన​ మృతిచెందింది. కాగా సదరు యువతి.. గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారని.. ఈ వ్యవహారంలో పెద్దలు పంచాయితీ పెట్టడంతో తనకు అన్యాయం జరిగిందని యువతి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Back to Top