బదిర మహిళపై జవాన్ల ఘాతుకం

Woman Accuses Army Personnel Of Raping Her - Sakshi

పూణే : బదిర మహిళపై నలుగురు జవాన్లు దారుణానికి ఒడిగట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తనపై నలుగురు సైనిక సిబ్బంది పూణే ఆస్పత్రిలో లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు. వితంతువైన బాధిత మహిళ ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు బాధితురాలిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ నాలుగేళ్ల పాటు ఆమెపై లైంగిక దాడి కొనసాగించారని ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది.

పూణేలోని ఖడ్కి మిలటరీ ఆస్పత్రి వద్ద విధుల్లో ఉన్న నలుగురు సైనిక సిబ్బందిపై ఆస్పత్రి ఆవరణలో బదిర మహిళపై లైంగిక దాడి, వేధింపులకు గురిచేసినందుకు కేసు నమోదు చేశారు. ఓ ఎన్‌జీవో సాయంతో బాధిత మహిళ ఇండోర్‌లో ఫిర్యాదు చేసి కేంద్ర రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్‌కు లేఖ రాశారు. నిందితుల్లో ఇద్దరు జవాన్లు బాధితురాలిపై లైంగిక దాడి దృశ్యాలతో కూడిన వీడియో క్లిప్‌ తయారుచేసి దాన్ని చూపి మహిళను బ్లాక్‌మెయిల్‌ చేశారని పోలీస్‌ అధికారి వెల్లడించారు. ఆస్పత్రి వర్గాలకు బాధితురాలు చేసిన ఫిర్యాదులను ఎవరూ పట్టించుకోలేదన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top