క్షణికావేశంలో వ్యక్తిని దారుణంగా హత్య | Vikarabad Man Brutally Stabbed To Death In Road Rage Incident | Sakshi
Sakshi News home page

క్షణికావేశంలో వ్యక్తిని దారుణంగా హత్య

Aug 15 2019 12:22 PM | Updated on Aug 15 2019 12:22 PM

Vikarabad Man Brutally Stabbed To Death In Road Rage Incident - Sakshi

సాక్షి, వికారాబాద్‌: వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని రామయ్యగూడలో బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు వివరాల ప్రకారం.. వికారాబాద్‌లోని రామయ్యగూడకు చెందిన బసిరెడ్డిపల్లి సత్యనారాయణ (49)  షాద్‌నగర్‌ సమీపంలోని బాల్‌నగర్‌లో సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తుండేవాడు. పోలీసులు వివరాల ప్రకారం.. వికారాబాద్‌లోని రామయ్యగూడకు చెందిన బసిరెడ్డిపల్లి సత్యనారాయణ (49)  షాద్‌నగర్‌ సమీపంలోని బాల్‌నగర్‌లో సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తుండేవాడు.

ఆయన వికారాబాద్‌లో భార్య అమృతమ్మతో పాటు, ఇద్దరు కూతుళ్లు, రెండు నెలల బాబుతో కలిసి నివసిస్తున్నాడు. అనారోగ్యంగా ఉండడంతో సత్యనారాయణ వైద్యం చేయించుకునేందుకు బుధవారం సాయంత్రం 7:15 గంటల సమయంలో రామయ్యగూడ నుంచి వికారాబాద్‌లోకి వస్తున్నాడు. అయితే రామయ్యగూడ ప్రధాన రోడ్డు వద్ద ఆటో ఎక్కుతున్న సమయంలో కొందరు వ్యక్తులతో గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. గొడవ జరుగుతుండగానే ఆటో ఎక్కి వస్తున్న సత్యనారాయణను శివరాంనగర్‌ కాలనీ సమీపంలో మరోసారి వ్యక్తి అడ్డగించాడు. క్షణాకావేశంలో అతడి తలను బలంగా రోడ్డుకు బాదేసి కొట్టడంతో సత్యనారాయణ స్పృహ కోల్పోయాడు. అనంతరం దుండగుడు పదునైన కత్తితో కడుపులో పొడిచాడు. దీంతో సత్యనారాయణ అక్కడిక్కడే మృత చెందాడు.


సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ, హత్యకు గురైన సత్యనారాయణ 

స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగుడు కత్తితో అందరినీ బెదిరించాడు. సత్యనారాయణ మృతిచెందాడని నిర్ధారించుకుని దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు.  హత్య విషయం అప్పటికప్పుడు వికారాబాద్‌లో దావానంలా వ్యాపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ సీతారామ్‌ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ లక్ష్మయ్య ఆధ్వర్యంలో హత్యకు సంబంధించిన ఆధారాలను క్లూస్‌ టీం సహకారంతో సేకరించారు. 
కలకలం రేపుతున్న వరుస హత్యలు 
వరుస హత్యలతో పట్టణావుసులు ఉలిక్కిపడుతున్నారు. ఇటీవల జరిగిన తల్లీఇద్దరు పిల్లల దారుణహత్య మరువక ముందే తాజాగా నడిరోడ్డులో వ్యక్తి దారుహత్యకు గురికావడం వికారాబాద్‌వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement