కంటి చుక్కల మందుతో భర్త ప్రాణం తీసింది

US Nurse Poisons Husband To Death Using Eye Drops - Sakshi

వాషింగ్టన్‌ : కంట్లో వేసే చుక్కల మందు తన భర్త ప్రాణం తీస్తుందని ఆమె అస్సలు ఊహించలేదు. రెండు సంవత్సరాల కింద చేసిన పని ఆమెను కటాకటాల వెనక్కి నెట్టేలా చేసింది. తన భర్తకు విషం ఇచ్చినట్లు అటాప్సీ రిపోర్టులో తేలడంతో కోర్టు ఆమెకు 25 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఈ అనూహ్య ఘటన అమెరికాలోని దక్షిణ కరోలినా ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. దక్షిణ కరోలినా ప్రాంతానికి చెందిన  స్టీవెన్ క్లేటన్ (64),  లానా స్యూ క్లేటన్ (53) భార్యభర్తలు. లానా నర్స్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త స్టీఫెన్‌ వాలంటరీ రిటైర్మంట్‌ తీసుకొని ఇంట్లోనే ఉంటున్నాడు. వీరిద్దరు కలిసి షార్లెట్ సమీపంలోని క్లోవర్‌లో నివసిస్తున్నారు. కాగా 2018 జూలైలో ఆమె తన భర్త స్టీవెన్‌కు తాగేనీటిలో చుక్కల మందును కలిపి ఇచ్చినట్లు తెలిసింది.

మొదట్లో ఆమె భర్త సాధారణంగానే చనిపోయాడని అందరూ భావించారు. అయితే అటాప్సీ టాక్సికల్‌ రిపోర్ట్‌లో విషపదార్థం కలవడంతోనే స్టీవెన్‌ మరణించినట్లు ఫోరెన్సిక్‌ నిపుణులు స్పష్టం చేశారు.స్టీవెన్‌ తాగిన నీటిలో టెట్రాహైడ్రోజోలిన్‌ ఎక్కువ మోతాదులో ఉండడంతో అతను మృతి చెందినట్లు రిపోర్టులో తేలింది. దీంతో 2018 ఆగస్టులో పోలీసులు లానా క్లేటన్‌పై కేసు నమోదు చేశారు.  2016లోనూ లానా క్లేటన్‌ ఇదే విధంగా స్టీఫెన్‌ను గొడ్డలితో తల వెనుక భాగంలో కొట్టి చంపడానికి ప్రయత్నించడంతో పాటు దానిని ఒక యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు స్టీఫెన్‌ తరపు న్యాయవాది ఆరోపించారు. అయితే సాక్షాలన్నీ లానాకు వ్యతిరేకంగా ఉండడంతో.. తన భర్తను ఉద్దేశపూర్వకంగానే చంపినట్లు కోర్టు నిర్ధారించి ఆమెకు 25 సంవత్సరాలు శిక్షను ఖరారు చేసింది.

'నేను నా భర్తను చంపడానికి ప్రయత్నించలేదు. కేవలం అతన్ని మత్తులోకి తీసుకెళ్లాలనే తాగేనీటిలో కంటి మందును కలిపి ఇచ్చాను. కానీ ఆ మందు అతని ప్రాణం తీస్తుందని నేను ఊహించలేదంటూ' లానా కన్నీటీ పర్యంతమైంది'. ' నా సోదరుడిని లానా స్యూ క్లేటన్‌ అన్యాయంగా పొట్టనబెట్టుకుంది. ఇంత దారుణంగా స్టీఫెన్‌ను చంపుతుందని నేను ఊహించలేదు. ఎంతో తెలివిగా తాగేనీటిలో కంటి చుక్కల మందును కలిపి చంపిందని' స్టీఫెన్‌ సోదరి రోస్‌మేరీ క్లేటన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top