రూ. 14లక్షల వాచ్‌ను తెలివిగా కాజేశారు | Two men theft rolex watch kept duplicate in the place of original | Sakshi
Sakshi News home page

రూ. 14లక్షల వాచ్‌ను తెలివిగా కాజేశారు

Feb 1 2018 5:05 PM | Updated on Feb 1 2018 7:20 PM

Two men theft rolex watch kept duplicate in the place of original - Sakshi

రోలెక్స్‌ వాచ్‌ (ప్రతీకాత్మక చిత్రం)

సింగపూర్‌ : మారుతున్న కాలంతో పాటు దొంగలు కూడా తెలివిగా చోరీలకు పాల్పడుతున్నారు. కొనుగోలుదారులుగా నటించిన ఇద్దరు దొంగలు యజమాని కళ్లు గప్పి రూ. 14.3 లక్షల విలువైన వాచ్‌ను ఎత్తుకెళ్లిన ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. టాంగ్‌ అనే వ్యక్తి తన రోలెక్స్‌ వాచ్‌ను కార్వోసేల్‌ అనే ఆన్‌లైన్‌ సెల్లింగ్‌ వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు.

దాని విలువ రూ. 14.3 లక్షలు(29,500 సింగపూర్‌ డాలర్లు)గా పేర్కొన్నారు. అమ్మకానికి పెట్టిన వాచ్‌ను చూసిన వెన్‌పింగ్‌, జోష్వా అనే ఇద్దరు దొంగలు దాన్ని దొంగిలించాలని నిర్ణయించుకున్నారు. అచ్చూ ఆ వాచ్‌లానే కనిపించే నకిలీ రోలెక్స్‌ వాచ్‌ను కొనుగోలు చేశారు. వాచ్‌ను కొనుగోలు చేస్తామని యజమానిని సంప్రదించారు. టాంగ్‌ చెప్పిన అడ్రస్‌కు వెళ్లిన నిందితులు వాచ్‌ను చూపించమన్నారు.

టాంగ్‌కు అనుమానం రాకుండా ఒరిజినల్‌ వాచ్‌ స్థానంలో నకిలీ వాచ్‌ను ఉంచి అక్కడి నుంచి ఉడాయించారు. దీన్ని ఆలస్యంగా గ్రహించిన టాంగ్‌ మరుసటి రోజు పోలీసులను ఆశ్రయించాడు. సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement