వేములవాడలో గ్యాంగ్‌వార్‌ను తలపించే ఘటన | Two Groups Fight Each Other In Vemulawada Over A Petty Issue | Sakshi
Sakshi News home page

వేములవాడలో గ్యాంగ్‌వార్‌ను తలపించే ఘటన

Jun 22 2020 9:59 AM | Updated on Jun 22 2020 12:02 PM

Two Groups Fight Each Other In Vemulawada Over A Petty Issue - Sakshi

రాజన్నసిరిసిల్ల: వేములవాడలో ఆదివారం సాయంత్రం గ్యాంగ్‌వార్‌ను తలపించే ఘటన చోటుచేసుకుంది. రెండు వర్గాలవారు దాదాపు 20 నిముషాలపాటు రణరంగాన్ని సృష్టించారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వివరాలు.. రాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ఓ యువకుడిని మరో యువకుడు ప్రశ్నించాడు. నెమ్మదిగా వెళ్లాలని మందలించాడు. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు యువకుల స్నేహితులు సైతం రంగంలోకి దిగడంతో వివాదం మరింత ముదిరింది. రెండు గ్రూపుల యువకుల పరస్పర దాడులతో స్థానియకులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. పది మందిపై కేసు నమోదు చేశారు. గొడవకు సంబంధించిన వీడియో బయటికొచ్చింది.
(చదవండి: వెళ్లనీయరు.. ఉండనీయరు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement