కుందులి  కేసులో ఇద్దరు అధికారుల విచారణ

The Trial Of Two Officers In Kundhuli Case - Sakshi

జయపురం: కొరాపుట్‌ జిల్లా కుందులిలో  బాలికపై సామూహిక లైంగికదాడి ఆరోపణల కేసులో దర్యాప్తు కమిషన్‌ (జయపురం జిల్లా జడ్జి) ఆదివారం మరో ఇద్దరు అధికారుల సాక్ష్యాలను సేకరించింది. ఈ కేసును దర్యాప్తు చేసిన క్రైమ్‌ బ్రాంచ్‌ డీఎస్‌పీ సౌభాగ్యలక్షి పట్నాయక్‌ తో పాటు లక్ష్మీపూర్‌  డీఎస్‌పీ తపన నారాయణ రథ్‌లను  కమిషనర్‌ విద్యుత్‌ కుమార్‌ మిశ్రా ప్రశ్నించి వారినుంచి దర్యాప్తు రికార్డులను పరిశీలించి విషయాలను సేకరించారు.

ఈ విచారణలో ప్రభుత్వ న్యాయవాది, దర్యాప్తు కమిషన్‌ ప్రత్యేక న్యాయవాది ప్రభాకర  పట్నాయక్‌ కూడా పాల్గొన్నారు. గత ఏడాది అక్టోబర్‌  10 వ తేదీన కొరాపుట్‌ జిల్లా కుందులి సమీప సొరిసిపొదర్‌ గ్రామంలోని  ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న ముషిగుడ గ్రామానికి  చెందిన 14ఏళ్ల బాలిక కుందులి నుంచి ఇంటికి వెళ్తున్న  సమయంలో జవాన్‌ దుస్తులు ధరించి ఆయుధాలు గలిగిన  నలుగురు వ్యక్తులు ఆమెను ఎత్తుకు పోయి సమీప అడవిలో సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని బాధిత బాలిక ఆరోపించిన   విషయం పాఠకులకు విదితమే.

అనంతరం బాధిత బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో నిజానిజాలు  తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొరాపుట్‌ జిల్లా జడ్జి విద్యుత్‌ కుమార్‌ మిశ్రాతో  దర్యాప్తు  కమిషన్‌ను నియమించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top