ముగ్గురు మహిళా దొంగల అరెస్ట్‌

Three Womens Arrested For Gold Snatching In Miryalguda - Sakshi

సాక్షి, మిర్యాలగూడ : బస్టాండ్‌లో బస్సు ఎక్కే మహిళల దృష్టిని మరల్చి బంగారం, నగదును అపహరించే ముగ్గురు మహిళా దొంగల ముఠా సభ్యులను వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సస్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సదానాగరాజు కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన దనుగుల కవిత, కోదాడ పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన సంపంగి సైదమ్మ, సంపంగి తిరుపతమ్మలు ముఠాగా ఏర్పడ్డారు. బస్టాండ్‌లో బస్సు ఎక్కే మహిళల హాండ్‌బ్యాగ్‌లు, పర్సులు, దొంగలిస్తారని తెలిపారు.

ప్రధానంగా నల్లగొండ, మిర్యాలగూడ బస్టాండ్‌లో రద్దీగా ఉండే బస్సులను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలి పారు. ఇదే క్రమంలో 2017లో మిర్యాలగూడ బస్టాండ్‌లో, 2019 ఫిబ్రవరిలో డాక్టర్స్‌ కాలనీలో ఒక మహిలతో మాటలు కలిపి ఆమె వద్ద ఉన్న చేతి సంచిలోంచి రూ.50వేల నగదు, ఇదే ఏడాదిలో మార్చిలో బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న మహిల నుంచి బంగారు ఆభరణాలు అపహరించారని తెలిపారు. అదే విధంగా నల్లగొండ, హాలియా, సాగర్‌ బస్టాప్‌ వద్ద మహిళలు బస్సు ఎక్కుతుండగా పర్సు కొట్టేశారని తెలిపారు.

మిర్యాలగూడలో దొంగిలించిన బంగారు ఆబరణాలను విక్రయించేందుకు వెళుతున్న క్రమంలో పట్టణంలోని గణేష్‌ మార్కెట్‌ వద్ద తనిఖీల్లో పట్టుకున్నామని తెలిపారు. వీరి వద్ద నుంచి 6.5 తులాల బంగారం, రూ.15వేల నగదు ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. మహిళా దొంగలను అరెస్టు చేయడంలో సహకరించిన ఎస్‌ఐ.రజిననీకర్, కుర్మయ్య, కానిస్టేబుల్‌ రవి, హోంగార్డు కిరణ్‌కుమార్‌లను అభినందించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top