వేర్వేరు చోట్ల ముగ్గురి ఆత్మహత్య

Three Persons Suicide With Some Problems Nalgonas - Sakshi

చింతలపాలెం (హుజూర్‌నగర్‌) : వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉమ్మడి జిల్లా పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. హుజూర్‌నగర్‌ పట్టణానికి చెందిన ్ఠ్జ్జ్జ్జకతారి నవ్య (18) తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు.  కాగా తన మానసిక స్థితి సరిగా లేక ఉరివేసుకుందని అన్న లింగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోవర్ధన్‌ తెలిపారు.

చీమలకొండూర్‌లో యువకుడు
భువనగిరిఅర్బన్‌ :
పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం మండలంలోని చీమలకొండూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన వడ్డెమాన్‌ బొందయ్య కుమారుడు వడ్డెమాన్‌ ప్రమోద్‌కుమార్‌(26) కూలి పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం అనంతారం గ్రామానికి చెందిన యువతితో వివాహం జరి గింది. కుటుంబ కలహాల కారణంతో మనస్తాపానికి గురై మధ్యాహ్న సమయంలో చీమలకొండూరు గ్రామశివారులోని డాంబర్‌ కంపెనీ పక్కన ఉన్న వెంచర్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. వెంచర్‌లో పడి ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు.

నాగారంబంగ్లాలో వ్యక్తి..
నాగారం (తుంగతుర్తి) :
మండల పరిధిలోని నాగారంబంగ్లా గ్రామానికి చెందిన కుమ్మరికుంట్ల శ్రీనివాస్‌రెడ్డి (45) లారీడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఆరు నెలల క్రితం శ్రీనివాస్‌రెడ్డి తనభార్య మాధవిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించడంతో ఆమె మృతిచెందింది. ఈ ఘటనలో శ్రీనివాస్‌రెడ్డి జైలుకెళ్లి బెయిల్‌పై విడుదలై లారీడ్రైవర్‌గా పనిచేస్తూ తల్లి్లతో కలిసి నివసిస్తున్నాడు. వ్యక్తిగత కారణాల నేపథ్యంలో మనస్తాపానికి గురై  ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగాడు. తల్లి గమనించేలోపే మృతిచెందాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top