సామూహిక లైంగికదాడి కేసులో ముగ్గురి అరెస్ట్‌

Three Arrest in Married Women Molestation Case - Sakshi

రెండు కార్లు, మూడుసెల్‌ ఫోన్లు స్వాధీనం

హస్తినాపురం: మద్యం మత్తులో ఓ మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను వనస్థలిపురం పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ, సీఐ వెంకటయ్యతో కలిసి వివరాలు వెల్లడించారు. కొత్తపేటకు చెందిన మహిళ(32) మ్యాక్స్‌ జీవిత బీమా సంస్థలో ఏజెంట్‌గా పని చేసేది. రెండేళ్ల క్రితం ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది. మన్సురాబాద్‌కు చెందిన సీసీ కెమెరాల వ్యాపాపారి మనోజ్‌కుమార్‌ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో గత కొన్ని నెలలుగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆమె మనోజ్‌ కుమార్‌పై ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత సోమవారం ఆమె మనోజ్‌ కుమార్‌కు ఫోన్‌ చేయడంతో ఆమెను స్నేహమైనగర్‌ కాలనీకి రప్పించాడు. అక్కడికి వచ్చిన బాధితురాలి పట్ల మనోజ్‌కుమార్‌ అతని స్నేహితులు అసభ్యకరంగా ప్రవర్తించడమేగాక అతని స్నేహితులు  కోహెడ గ్రామానికి చెందిన కొలను సిద్దార్థరెడ్డి, మీర్‌పేటకు చెందిన సతీష్, బాబీ, జంగారెడ్డి మద్యం మత్తులో తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి వారి నుంచి రెండు కార్లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని  రిమాండ్‌కు తరలించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top