మద్యం తాగించి స్నేహితులతో అత్యాచారం.. | Molestation on Married Women in Hyderabad | Sakshi
Sakshi News home page

వివాహితపై సామూహిక లైంగికదాడి

Apr 16 2019 6:40 AM | Updated on Apr 16 2019 7:01 AM

Molestation on Married Women in Hyderabad - Sakshi

8మంది స్నేహితులతో కలిసి పార్టీ చేసుకొని సాహెబ్‌నగర్‌లోని ఓ ఇంట్లో పార్టీ ఉందని ప్రియురాలిని పిలిపించారు.

హస్తినాపురం: మద్యం మత్తులో వివాహితపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్‌ పరిధిలోని సాహెబ్‌నగర్‌ ప్రాంతానికి ఓ యువకుడు తన స్నేహితురాలిని నమ్మించి మందు పార్టీకి పిలిపించాడు. ఆమెకు మద్యం తాగించి తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. కొత్తపేట గ్రీన్‌హిల్స్‌ కాలనీలో నివాసముంటున్న సదరు మహిళ (32)కు పెళ్లి కాగా.. భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది.

ఈమెకు మన్సురాబాద్‌కు చెందిన సీసీ కెమెరాల వ్యాపారి మనోజ్‌కుమార్‌ (30)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. మనోజ్‌కుమార్‌ తన 8మంది స్నేహితులతో కలిసి పార్టీ చేసుకొని సాహెబ్‌నగర్‌లోని ఓ ఇంట్లో పార్టీ ఉందని ప్రియురాలిని పిలిపించారు. అక్కడికి వెళ్లిన ఆమెకి మనోజ్‌కుమార్, అతని స్నేహితులు బలవంతంగా మద్యం తాగించారు. అధిక మద్యం తాగిన మనోజ్‌కుమార్‌ ప్రియురాలు నిద్రమత్తులోకి జారుకుంది. ఇదే అదునునుగా భావించిన మనోజ్‌కుమార్, అతని స్నేహితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన మహిళ తనకు జరిగిన అన్యాయంపై వనస్థలిపురం పోలీçసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ వెంకటయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement