నౌహీరా కేసులో కీలక పరిణామం | Telangana High Court Transfer Nowhera Shaikh Case To Serious Fraud Investigation | Sakshi
Sakshi News home page

నౌహీరా కేసు.. సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌కి బదిలీ

Dec 25 2019 2:59 PM | Updated on Dec 25 2019 3:02 PM

Telangana High Court Transfer Nowhera Shaikh Case To Serious Fraud Investigation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హీరా గ్రూప్స్ అధినేత నౌహీరా కేసును తెలంగాణ హైకోర్టు బుధవారం సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌కి బదిలీ చేసింది. దేశ వ్యాప్తంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసి నౌహిరా షేక్ మోసం చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం నౌహిరా షేక్ చంచల్‌గూడ జైల్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 2018న సీసీఎస్ పోలీసులు నౌ హీరా పై కేసు నమోదు చేశారు. అక్టోబర్ 2018లో హీరా షేక్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 28 మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. నౌహీరా బ్యాంక్ ఖాతాల్లో జరిగిన లావాదేవీల్లో డిపాజిటర్ల నుండి తీసుకున్న డబ్బుతో పాటు, డిపాజిటర్లకు తిరిగి చెల్లించిన వివరాలు, నిధులు మళ్లించిన వివరాలను సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement