రైలుకింద పడి విద్యార్థిని ఆత్మహత్య | Student Commits Suicide On Train Track Karnataka | Sakshi
Sakshi News home page

రైలుకింద పడి విద్యార్థిని ఆత్మహత్య

Oct 6 2018 12:21 PM | Updated on Nov 9 2018 5:06 PM

Student Commits Suicide On Train Track Karnataka - Sakshi

మేఘామేరిస్‌(ఫైల్‌)

కర్ణాటక, కోలారు: పట్టాలపై నడుస్తూ రైలుకు ఎదురెళ్లి పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న  విద్యార్థిని ఉదంతం శుక్రవారం నగరంలోని కారంజికట్ట రైల్వే ట్రాక్‌పై చోటు చేసుకుంది. నగరంలోని హరోహళ్లిలో నివాసం ఉంటున్న    మేఘ మేరిస్‌ (17) నగరంలోని మదర్‌ థెరెసా కళాశాలలో డిప్లోమా చదువుతోంది.  తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఇంటినుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చిన మేఘామేరిస్‌.. ఉదయం 6 గంటల సమయంలో బెంగుళూరుకు వెళ్లే ప్యాసింజెర్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.  రైల్వే  పోలీసులు ఉదయం 9 గంటలకు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలన జరిపారు.  మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. బంగారుపేట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మేఘామేరిస్‌ ఆత్మహత్యకు అసుల కారణాలు ఇంతవరకు తెలియలేదు.


Advertisement
 
Advertisement
Advertisement