అమ్మాయి చేతిలో ఓడిపోయానని.. | Student Commits Suicide Defeated In School Elections In Ramannapet | Sakshi
Sakshi News home page

స్కూల్‌ ఎన్నికల్లో ఓటమి.. విద్యార్థి ఆత్మహత్య

Jul 19 2019 10:40 AM | Updated on Jul 19 2019 10:47 AM

Student Commits Suicide Defeated In School Elections In Ramannapet - Sakshi

సాక్షి, యాదాద్రి: జిల్లాలోని  రామన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్‌ ఎలక్షన్‌లో ఓడిపోయాననే మనస్థాపంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి రైలు కింద పడి చనిపోయాడు. వివరాలు.. సాయి చరణ్‌ అనే విద్యార్థి రామన్నపేట పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం పాఠశాలలో క్లాస్‌ లీడర్‌ ఎన్నికలు జరిగాయి. సాయి చరణ్‌ పోటీలో నిలిచాడు.

అయితే ఈ ఎన్నికల్లో సాయి చరణ్‌తో పాటు నిల్చున్న మరో బాలికను క్లాస్‌ లీడర్‌గా ఎన్నుకున్నారు విద్యార్థులు. తోటి అమ్మాయి చేతిలో ఓడిపోవడంతో తీవ్ర మనస్థాపినికి గురైన సాయి కిరణ్‌ నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి పోయి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement