మద్యం మత్తులో డ్రైవింగ్‌..ఇద్దరి మృతి

Speeeding SUV Kills Two In Jaipur - Sakshi

జైపూర్‌: ఎస్‌యూవీ కారు, రోడ్డు పక్కన నిద్రిస్తున్న నలుగురిపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన రాజస్తాన్‌లోని జైపూర్‌ నగరం గాంధీనగర్‌లో ఓ ఫైఓవర్‌ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. డ్రైవింగ్‌ చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు భరత్‌ భూషణ్‌ మీనా రక్తంలో ఆల్కహాల్‌ ఉండవలసిన దాని కంటే 9 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ప్రమాదానికి కారణమైన కారు బద్రీ నారాయణ్‌ మీనా అనే బీజేపీ కిసాన్‌ మోర్చా నాయకుడి పేరు మీద రిజిస్టర్‌ అయింది. ఎస్‌యూవీ వెనక అద్దాలపై రాజస్తాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే గౌరవ యాత్రకు సంబంధించిన ఫోటోలు అంటించి ఉన్నాయి. ఘటన తర్వాత వాటిని తొలగించినట్లుగా తెలుస్తోంది.  నిందితుడిపై హత్యాయత్నం, రాష్‌ డ్రైవింగ్‌లకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top