కొడుకు కాదు.. కర్కోటకుడు

Son Attack Father Bangalore - Sakshi

సుత్తితో బాది తండ్రిని హత్య చేసిన తనయుడు

ఐదు గంటల్లోనే నిందితుడి అరెస్ట్‌

మాలూరు: పెంచి పెద్ద చేసిన తండ్రిని పువ్వుల్లో పెట్టి చూసుకోవల్సిన తనయుడు కర్కోటకుడిగా మారాడు. మద్యం మత్తులో తండ్రిని సుత్తితో బాది దారుణంగా హతమార్చాడు.  ఈ ఘటన   తాలూకాలోని బంటహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన రామచంద్రప్ప (70) నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలున్నారు. 3వ కుమారుడు మంజునాథ్‌ బెంగుళూరులోని మారతహళ్లిలలో షేవింగ్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు.

నాలుగు నెలల క్రితం గ్రామానికి తిరిగి వచ్చిన మంజునాథ్‌  తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి తండ్రితో గొడవపడేవాడు. బుధవారం రాత్రి కూడా తాగి ఇంటికి వచ్చి తండ్రిపై దాడి చేశాడు. అనంతరం వైర్‌తో గొంతును చుట్టి రొకలి, సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం ఉడాయించాడు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. విస్తృతంగా గాలింపు చేపట్టి 5 గంటలలోగానే నిందితుడు మంజునాథ్‌ను అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top