ఘోరం.. కరెంట్‌ షాక్‌తో ఆరేళ్ల బాలుడు మృతి | Six Year Old  Electroctuted During Play in Narsingi Gated Society | Sakshi
Sakshi News home page

ఘోరం.. కరెంట్‌ షాక్‌తో ఆరేళ్ల బాలుడు మృతి

Feb 12 2019 3:06 PM | Updated on Feb 12 2019 3:38 PM

Six Year Old  Electroctuted During Play in Narsingi Gated Society - Sakshi

విద్యుత్‌ షాక్‌ గురైనా సమయంలో చుట్టూ జనాలున్నా ఎవరూ గమనించకపోవడం

హైదరాబాద్: నగరంలో నార్సింగి సమీపంలో పీబీఈఎల్‌ గేటెడ్‌ సోసైటీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆరేళ్ల బాలుడు కాలనీలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ గురై మరణించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సదరు బాలుడు ఆడుకుంటూ ల్యాంప్‌ పోస్ట్‌ను పట్టుకోవడంతో అండర్‌ గ్రౌండ్‌ వైర్లు తాకి షాక్‌కు గురయ్యాడు. అయితే బాలుడు విద్యుత్‌ షాక్‌ గురైనా సమయంలో చుట్టూ జనాలున్నా ఎవరూ గమనించలేదు. ఏ ఒక్కరూ చూసి స్పందించిన బాలుడు బతికేవాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ అధికారులు విచారణ చేపట్టారు. పార్కులో అలంకరణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే మృతి చెందిన బాలుడి తండ్రి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అని వారు చెన్నైలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. బాలుడిని మృతదేహాన్ని కూడా అక్కడికి తరలించినట్లు సమాచారం. అయితే కనీసం బయట వ్యక్తులను కూడా అనుమతించిన పీబీఈఎల్ భద్రతా సిబ్బంది‌.. బాలుడి పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇక  ఈ పెబెల్‌ సిటీలో సుమారు 1300 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ఘటనతో ఈ నివాస సముదాయంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement