సెల్ఫీతో సూసైడ్..? | Selfie Suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

సెల్ఫీ సూసైడ్‌ కలకలం

May 17 2018 5:23 PM | Updated on Nov 6 2018 8:16 PM

Selfie Suicide in Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని సరూర్‌ నగర్‌లో సెల్ఫీ సూసైడ్‌ కలకలం రేగింది. సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  వివరాల్లోకి వెళితే..  ఘట్‌కేసర్‌ మండలం అన్నోజి గూడ గ్రామానిక చెందిన అనిల్‌ కుమార్‌ రిలయన్స్‌లో మార్కెట్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అనిల్‌ కుమార్‌ సరూర్‌ నగర్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయ సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయితే అనిల్‌ కుమార్‌‌(21) బుధవారం రాత్రి 11 గంటల సమయంలో సెల్ఫీ వీడియో తీసుకొని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. డిప్రెషన్‌తోనే అనిల్‌ సూసైడ్‌ చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement