
భువనేశ్వర్ : ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌పై దాడి చోటుచేసుకుంది. ప్రస్తుతం ఒడిశాలోని పూరీ జిల్లా ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆయనపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇసుకతో బొమ్మలు చెక్కటం ద్వారా ఆయన ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.