మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident In Narsingi Medak District | Sakshi
Sakshi News home page

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Mar 16 2020 4:57 AM | Updated on Mar 16 2020 5:28 AM

Road Accident In Narsingi Medak District - Sakshi

సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగ్‌ 44వ జాతీయ రహదారిపై ఆగిఉన్న డీసీఎం వ్యాన్‌ను వెనక నుంచి ఓ ఓమ్ని వ్యాన్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓమ్ని వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు సిరిసిల్లా జిల్లా దమ్మన్న పేట గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి సిరిసిల్లకు తిరిగి వస్తున్న సమయంలోనే ఓమ్ని వ్యాన్‌ మరో వ్యాన్‌ను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. అయితే పూర్తి సమాచారం తెలియాల్సివుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement