
రహదారిపై మూలమలుపులు
మానకొండూర్: కరీంనగర్–వరంగల్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. వాహనాల రద్ధీ కూడ పెరిగిపోతోంది. డబుల్‌లైన్ కావడంతో వాహనదారులు ఓవర్‌టేక్ చేస్తూ దూసుకెళ్తున్నారు.
ఇదే సమయంలో ఎదురుగా వచ్చిన వాహనాలను ఢీకొనడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పెరిగిన రద్దీ దృష్ట్యా రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తూ
భారీ రోడ్డు ప్రమాదాలన్నీ ఓవర్‌టేక్ చేయడం వల్ల జరుగుతున్నవే. గతంలో కూడ మానకొండూర్ మండలం ఖాదర్‌గూడెం సమీపంలో ఓ కారు ఓవర్‌టేక్ చేస్తూ ఎదురుగా వచ్చిన బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఓకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు.
ఈదులగట్టెపల్లి బిడ్జిపై ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. నెల రోజుల కిందటే మానకొండూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో లారీ, కారు ఢీకొన్న సంఘటన ఇలాంటిదే. ఈ నెల 10న కేసీఆర్ సభకు వెళ్లి వస్తున్న పోలీసుల వాహనం మరో కారు ఢీకొన్నాయి. 14 మంది వరకు గాయాలపాలయ్యారు. ఒకరు మృతిచెందారు.
నిబంధనలు అవసరం
కరీంనగర్– వరంగల్ రహదారిపై వాహనాలు రద్ధీ పెరిగిపోయిన దృష్ట్యా ఎక్కువగా ప్రమాదా లు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వాహనదారులు జాగ్రత్తగా వేగంగా కాకుండా నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తూన్నారు.