బాలికకు లైంగిక వేధింపులు | Retired SI Molestation On Girl In Tamil Nadu | Sakshi
Sakshi News home page

బాలికకు లైంగిక వేధింపులు

Jul 28 2018 9:06 AM | Updated on Jul 28 2018 9:06 AM

Retired SI Molestation On Girl In Tamil Nadu - Sakshi

అరెస్టయిన రామమూర్తి

అన్నానగర్‌: తిరునిండ్రవూర్‌ సమీపంలో 9వ తరగతి విద్యార్థిని లైంగికంగా వేధించిన రిటైర్డ్‌ ఎస్‌ఐని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ఆవడి సమీపం పట్టాభిరామ్‌ వళ్లలార్‌నగర్‌కు చెందిన రామమూర్తి (60) విరుగంబాక్కమ్‌ పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యాడు. మార్చిలో తిరునిండ్రవూర్‌ ప్రాంతంలో స్నేహితుడిని చూడడానికి ప్రభుత్వ పాఠశాల దారిలో బైకుపై వెళ్లాడు. ఆ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికను చూశాడు. ఆ బాలికకు రూ.5 వేలు ఇస్తానని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాలిక భయపడి పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయురాలికి చెప్పింది. ఉపాధ్యాయురాలు బయటకి వచ్చి చూడగా అప్పటికే రామమూర్తి పరారయ్యాడు. ఆగస్టు 18న పాఠశాలకు వెళ్లి రామమూర్తి ఆ బాలిక వద్ద మళ్లీ అసభ్యంగా ప్రవర్తించాడు.

అక్కడే ఉన్న బాలిక స్నేహితులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. తరచూ రామమూర్తి బాలికను ఇబ్బంది పెట్టేవాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. గురువారం తిరునిండ్రవూర్‌ సమీపంలో ఉన్న బాలిక ఇంటి సమీపానికి వెళ్లిన రామమూర్తి, సైగ మూలంగా బాలికకు లైంగిక వేధింపులు ఇచ్చాడు. దీనిపై తల్లిదండ్రులకు బాలిక చెప్పింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు రామమూర్తిని పట్టుకుని ఆవడి మహిళా పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. సీఐ శోభారాణి, పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రామమూర్తిని అరెస్టు చేశారు. తరువాత అతన్ని పూందమల్లి కోర్టులో హాజరు పరిచి పుళల్‌ జైలుకు తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement