వర్షిత హంతకుడి సీసీ ఫుటేజీ చిత్రాలు విడుదల

Release of CC footage images of the Varshitha murder case accused - Sakshi

కురబలకోట (చిత్తూరు జిల్లా):రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన చిన్నారి వర్షిత హత్య కేసు నిందితుడి సీసీ ఫుటేజీ చిత్రాలను సోమవారం డీఎస్పీ రవి మనోహరాచారి విడుదల చేశారు. ఇటీవల మదనపల్లె సమీపంలోని చేనేత నగర్‌ కల్యాణ మండపం వద్ద చిన్నారి వర్షిత దారుణ హత్యకు గురైన విషయం విదితమే.

సోమవారం కల్యాణ మండపంలో సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అందులో నమోదైన చిత్రాలను పత్రికలకు విడుదల చేశారు. ఇలాంటి పోలికలున్న వారి ఆచూకీ లభిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. 9440796738, 9440617891, 9440900705, 8885588558 నంబర్లకు ఆచూకీ తెలపాల్సిందిగా కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top