నటుడికి రియల్టీ గ్రూప్‌ కుచ్చుటోపీ!

Ravi Kishan Files Complaint Against Real Estate Firm - Sakshi

భోజ్‌పురి హీరో,  ‘రేసుగుర్రం’  ఫేం రవికిషన్‌ ముంబైకి చెందిన రియల్టీ సంస్థ కమలా ల్యాండ్‌ గ్రూప్‌ తనను మోసగించిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జుహులో ఫ్లాట్‌ నిర్మిస్తామని చెప్పడంతో తాను కోటిన్నర రూపాయలు చెల్లించానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు సదరు రియల్టీ గ్రూపు డైరెక్టర్లు జితేంద్ర జైన్‌, జినేంద్ర జైన్‌, కేతన్‌ షాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రవి కిషన్‌ కూడా నాలాగే మోసపోయాడు..
‘కమలా ల్యాండ్‌ గ్రూప్‌ను నమ్మి రవికిషన్‌ కూడా నాలాగే మోసపోయాడు. రెండు ఫ్లాట్ల కోసం వాళ్లు నా దగ్గర నుంచి ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకున్నారు. రవి నుంచి కూడా కోటిన్నర రూపాయలు వసూలు చేసి, సిద్ధాంత్‌ ప్రాజెక్టులో 3165 చదరపు మీటర్ల ఫ్లాట్‌ ఇస్తామన్నారు. ఇందుకు సంబంధించి అలాట్‌మెంట్‌ లెటర్‌ కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకు ఫ్లాట్‌ ఇవ్వలేదు. అందుకే ఇద్దరం కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాం అని ముంబైకి చెందిన వ్యాపారి సునీల్‌ నాయర్‌ వ్యాఖ్యానించారు. కాగా వీరిద్దరి ఫిర్యాదు మేరకు జితేంద్ర, జనేంద్ర, కేతన్‌లపై చీటింగ్‌, బ్రీచింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఈవోడబ్ల్యూ ఆఫీసర్‌ ఒకరు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top