వ్యభిచార గృహంపై పోలీసుల దాడి | Prostitution Scandal Revels in Visakhapatnam | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

Feb 22 2019 7:27 AM | Updated on Feb 22 2019 7:27 AM

Prostitution Scandal Revels in Visakhapatnam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): కాకానినగర్‌లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్, ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు మహిళలతో పాటు ఇద్దరు విటుల్ని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకానినగర్‌ బస్టాప్‌ వెనకనున్న ఇంట్లో కొన్నేళ్లుగా గుట్టుచప్పుడుగా వ్యభిచారం సాగిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ వాసునాయుడు, ఎయిర్‌పోర్ట్‌ సీఐ జెర్రిపోతుల శ్రీనివాసరావు సంయుక్తంగా దాడి చేశారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.9100 నగదును, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement