
సాక్షి, హైదరాబాద్ : హయత్‌నగర్‌లో కిడ్నాప్ అయిన బీఫార్మసీ విద్యార్థిని కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అపహరణకు గురై 24 గంటలు గడుస్తున్నా ఇంకా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందుతుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కేసు దర్యాప్తును స్వయంగా పరివేక్షిస్తున్న ఎల్‌బీ నగర్ డీసీపీ సంప్రీత్ సింగ్.. యువతి తండ్రి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే యువతి ఆచూకీ తెలుసుకొని కుటుంబానికి అప్పగిస్తామని పేర్కొన్నారు.