అనంతపురంలో దొంగల బీభత్సం.. కాల్పులు | police open fire on thieves | Sakshi
Sakshi News home page

దొంగల బీభత్సం.. పోలీసుల కాల్పులు

Jan 27 2018 9:01 AM | Updated on Oct 2 2018 2:30 PM

police open fire on thieves  - Sakshi

దెబ్బతిన్నపోలీసుల వాహనం

సాక్షి, అనంతపురం: అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.. తమపైనే దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సంఘటన అనంతపురం నగరంలో సంచలనం సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి ఓ వాహనంలో ఆవుల చోరీకి కొందరు దొంగలు యత్నించారు. విషయం తెలిసి అడ్డుకోబోయిన పోలీసులపై ఆ ముఠా దాడిచేసింది. దీంతో పోలీసులు దుండగులపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులపై రాళ్లు రువ్వుతూ దుండగులు పారిపోయారు. పోలీసుల రక్షక్‌ వాహనం దెబ్బతినడంతో దొంగలను పట్టుకునేందుకు పోలీసులు అంబులెన్స్‌ ఉపయోగించగా దాన్నికూడా ఢీకొట్టి పారిపోవడంతో స్వల్పంగా దెబ్బతిన్నది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Advertisement
 
Advertisement
Advertisement