స్వాతిరెడ్డిని విచారించిన పోలీసులు | Police are investigating Swathi Reddy | Sakshi
Sakshi News home page

స్వాతిరెడ్డిని విచారించిన పోలీసులు

Dec 24 2017 2:50 AM | Updated on Dec 24 2017 3:15 AM

Police are investigating Swathi Reddy - Sakshi

నాగర్‌కర్నూల్‌ క్రైం: ఇటీవల ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఘటనలో నిందితురాలిగా ఉన్న స్వాతిరెడ్డిని శనివారం పోలీసులు విచా రించారు. ఆమె విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకునేలా అనుమతి ఇవ్వాలని నాగర్‌ కర్నూల్‌ జిల్లా పోలీసులు రెండు రోజుల క్రితం అక్కడి కోర్టు లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు శుక్రవారం అను మతి లభించడంతో.. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా జైలు నుంచి ఆమెను నాగర్‌ కర్నూల్‌ తీసుకొచ్చారు. తొలుత ఆమెను పోలీస్‌స్టేషన్‌ కు తీసుకెళ్లిన పోలీసులు కొంత సమాచారం సేకరించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత సుధాకర్‌రెడ్డి హత్య జరిగిన ఇంటికి తీసుకువెళ్లారు.

ఇంట్లో పడిన రక్తపు మరకలను తుడి చిన బట్టలు, సుధాకర్‌రెడ్డి ధరించిన దుస్తులు, హత్య సమయంలో స్వాతి, రాజేష్‌ ధరించిన బట్టల విషయమై వారిని పోలీసులు గతంలో ప్రశ్నిస్తే.. తనకేమీ తెలియదని, స్వాతిరెడ్డికే తెలుసని చెప్పిన విషయం విదితమే. దీంతో ఇంటికి స్వాతిరెడ్డిని తీసుకు వెళ్లగా బీరువా కింద దాచి ఉం చిన బట్టలను స్వాతి పోలీసులకు అందజేసింది. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీ సులు.. స్వాతిని తిరిగి కోర్టులో హాజరుపర్చారు. ఆమెను రిమాండ్‌కు తరలించాలన్న న్యాయమూర్తి ఆదేశాలతో తిరిగి మహబూబ్‌నగర్‌ జైలుకు తీసుకువెళ్లారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement