ఎంఐఎం ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్‌ | Petition In High Court On MIM MLA Mumtaz Ahmed Khan | Sakshi
Sakshi News home page

ఎంఐఎం ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్‌

Jul 4 2018 8:44 PM | Updated on Aug 31 2018 8:42 PM

Petition In High Court On MIM MLA Mumtaz Ahmed Khan - Sakshi

యాకుత్‌పురా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌

హైదరాబాద్‌ : యాకుత్‌పురా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల సమయంలో ముంతాజ్‌ ఖాన్‌ పూర్తి ఆస్తుల వివరాలు వెల్లడించలేదని రూప్‌ రాజ్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఆధారాలతో పిటిషనర్‌ కోర్టుకు సమర్పించారు. దీనిని విచారించిన హైకోర్టు ఈ నెల 18 వరకు ఆస్తులకు సంబంధించి పూర్తి ఆధారాలు కోర్టుకు సమర్పించాలని ఎమ్మెల్యేకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement