పోలీసులపై కారం చల్లి.. 

People Sprayed The Chilli Powder On Police Officers In Visakapatnam - Sakshi

సాక్షి, అనకాపల్లి : అనకాపల్లి మండలం తగరంపూడిలో మద్యం బెల్టు దుకాణం నిర్వాహకులు శుక్రవారం పోలీసులపై కారం చల్లి తిరుగుబాటు చేసింది. రూరల్‌ ఎస్‌ఐ పి.రామకృష్ణ కథనం మేరకు వివరాలిలావున్నాయి. మండలంలోని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తగరంపూడి గ్రామంలో మద్యం బెల్టు దుకాణం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారంఅందింది. తక్షణమే అదనపు ఎస్‌ఐ ఎ.వెంకటేశ్వరరావు, హెచ్‌సీ మల్లేశ్వరి, కానిస్టేబుళ్లు కె.అప్పలనాయుడు, రాజ్‌కుమార్‌ గ్రామానికి చేరుకున్నారు. మద్యం విక్రయిస్తున్న కొప్పుల వెంకటలక్ష్మి దుకాణంలోకి ప్రవేశించి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.దీంతో అసహనానికి గురైన కొప్పుల వెంకటలక్ష్మి, భర్త ప్రసాదరావు, తల్లి భాషణ పార్వతి, సోదరుడు చిన్నారావు కానిస్టేబుళ్ళ కంటిపై కారం చల్లి తప్పించుకునే ప్రయత్నం చేశారని అదనపు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top