మా కొడుకును అప్పగించండి..

Old Parents Asking For About His Son Address - Sakshi

సాక్షి, జన్నారం(ఖానాపూర్‌): కనిపించకుండా పోయిన తమ కుమారుడిని అప్పగించాలని జన్నారం మండలం పొన్కల్‌కు చెందిన బచ్చల రాజం దంపతులు పోలీసు అధికారులను వేడుకుంటున్నారు. రాజం రెండవ కుమారుడు బచ్చల సతీశ్‌ కొన్నేళ్లుగా ఉట్నూర్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఉట్నుర్‌లో జరిగిన దొంగతనం కేసులో సతీశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈనెల 17 పోలీసులు ఇంటికి వచ్చి సతీశ్‌ గురించి అడిగే వరకు తమకు విషయం తెలియదన్నారు. గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన తమ కుమారుడి ఆచూకీ తెలపాలని కోరారు. ఈ విషయంపై జన్నారం ఎస్సై తహసీనోద్దీన్‌ను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, ఉట్నూర్‌లో జరిగిన ఓ దొంగతనం కేసులో సతీశ్‌ నిందితుడని తెలిసిందన్నారు.      

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top