సాక్షి, హైదరాబాద్: సిద్ధిపేట కమిషనరేట్ పరిధిలోని అక్కన్నపేట కాల్పుల కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. 2016లో హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్ నుంచి ఏకే–47 చోరీచేసిన సదానందం ఇంతకాలం ఎలా మెయింటైన్ చేశాడన్న విషయంపై పోలీసులు కూపీలాగుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సదానందం విపరీత, సున్నిత మనస్తత్వమున్నవాడు. ఆయుధాలన్నా, తుపాకులన్నా పిచ్చి. ఈ పిచ్చే ఠాణాలో తుపాకులు చోరీచేసే వరకూ తీసుకెళ్లింది. వీటిని దొంగిలించాక ఇంట్లోనే దాచి, ఎవరూలేని సమయంలో చూసుకుని మురిసిపోయేవాడు. సినిమాలు, యూట్యూబ్‌లు చూసి ఏకే–47 ఎలా ఫైర్ చేయాలో తెలుసుకున్నాడు. బుల్లెట్లు, ట్రిగ్గర్ పాడవకుండా కొబ్బరినూనెతో తుడిచేవాడు. బుల్లెట్లు లేకుండా ఏకే–47 ట్రిగ్గర్ నొక్కుతూ మురిసిపోయేవాడు. ఇలా ఏకే–47 ఫైర్ చేయడం నేర్చుకున్నాడు.
వెలుగులోకి వచ్చింది ఇలా...
ఏకే–47 ఆయుధాన్ని తెలంగాణలో జిల్లాల పునర్విభజనకు ముందే చోరీ చేశాడు. తన పాత కేసుల క్రమంలో తరచూ హుస్నాబాద్ స్టేషన్‌కి వెళ్లివచ్చే సదానందం దృష్టిని అక్కడి ఆయుధాలు ఆకర్షించాయి. ఏకే–47, కార్బైడ్‌లను చోరీ చేశాడు. ఆయుధాల చోరీ విషయాన్ని పోలీసులు దాచిపెట్టడంతో చాలాకాలం ఇది వెలుగులోకి రాలేదు. గతంలో హుస్నాబాద్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ పరిధిలో ఉండేది. 2016, అక్టోబర్‌లో జిల్లాల పునర్విభజన అనంతరం డిసెంబర్‌లో సిద్ధిపేట జిల్లాలోని పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వెళ్లిపోయింది. అదే ఏడాది డిసెంబర్‌లో ఆయుధాలను కమిషనరేట్‌కి లెక్కచూపే క్రమంలో ఏకే–47 మిస్సింగ్ విషయం వెలుగుచూసింది. దీంతో అప్పటి సీఐ గన్‌మెన్‌పై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అక్కన్నపేట కాల్పుల తరువాతే 9ఎంఎం కార్బన్‌గన్ కూడా పోయిన విషయం వెల్లడికావడం గమనార్హం.
తుపాకీ పోగొట్టుకుంటే..?
పోలీసుల తుపాకులు కనిపించకుండా పోతే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వెంటనే రాష్ట్ర పోలీసులు ఈ సందేశాన్ని రేడియో ద్వారా ఇండియాలోని అన్ని స్టేషన్‌లకు పంపుతారు. ఈ విషయంలో స్థానిక ఎస్పీ లేదా కమిషనర్ ఒక డీఎస్పీ స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమిస్తారు. సదరు అధికారి ఆయుధం ఎలాంటి పరిస్థితుల్లో పోయిందో దర్యాప్తు చేస్తారు. నిర్లక్ష్యం వహించినట్లు తేలితే వెంటనే కేసు నమోదు చేసి, సస్పెండ్ చేస్తారు. అంతేగాకుండా ఈ విషయాన్ని తరువాత లిఖిత పూర్వకంగా కేంద్రహోంశాఖతోపాటు రాష్ట్రం, దేశంలోని అన్ని పోలీస్‌ఠాణాలకు పంపుతారు. కాగా, గతంలో హుస్నాబాద్ ఠాణాలో పనిచేసిన సీఐ భూమయ్య, సీఐ శ్రీనివాస్‌ల హయాంలో ఈ ఆయుధాలు మాయమయ్యాయన్న విషయంలో స్పష్టత కరువైంది. అలాగే కార్బన్ వెపన్ మిస్సింగ్ విషయంలోనూ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. స్టేషన్ నుంచి 25 రౌండ్ల బుల్లెట్లతో ఉన్న ఏకే–47 వెపన్‌ను ఎత్తుకెళితే ఎందుకు గుర్తించలేకపోయారు. స్టేషన్‌లో సీసీ కెమెరాలు లేవా? సంబంధిత గన్‌మెన్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఎందుకు చెప్పలేదు? అంతటి మారణాయుధం పోయినా.. తూతూమంత్రంగా దర్యాప్తు జరపడం ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు పోలీసుల నుంచి సమాధానం లేదు.
వారంలో రెండు కాల్పుల ఘటనలు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకే వారంలో రెండు కాల్పుల ఘటనలు ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. ఫిబ్రవరి 1న జగిత్యాల సమీపంలోని గొల్లపల్లి మండలం ఎస్రాజ్‌పల్లిలో శ్రీనివాస్(మాజీ మావోయిస్టు) తుపాకీతో హల్‌చల్ చేశాడు. భార్య కాపురానికి రావడం లేదన్న కారణంతో అత్తగారింటిపై దాడి చేసి, అడ్డుకున్న రాజిరెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఫిబ్రవరి 6న అక్కన్నపేటలో సదానందం కాల్పులు జరపడం కలకలం రేపింది.
కాల్పుల్లో కొత్తకోణం.. సినిమాలో చూసి ఫైరింగ్
Published Tue, Feb 11 2020 2:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
Actor Nani HD Stills: వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement