ఇద్దరు పిల్లలు సహా తల్లి అదృశ్యం

మీర్‌పేట: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ అనంతరాములు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బడంగ్‌పేట శ్రీ సాయినగర్ కాలనీకి చెందిన మేకల శంకర్ ఇంట్లో నరపాక జగదీష్ భార్య శ్యామల (36), కుమారులు సందీప్ (5), లిఖిత్ (4)లతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. జూన్ 28న జగదీష్ ఇంట్లో లేని సమయంలో శ్యామల ఇద్దరు పిల్లలతో సహా బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం బంధువుల ఇలళ్లు, ఇతర ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో జగదీష్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా వారి ఇంటి యజమాని కుమారుడు మేకల శివకుమార్ (21) కూడా కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి