ఇద్దరు పిల్లల్ని బావిలోకి తోసేసి..

Mother Commited Suicide Attempt With Her Two Kids In Buchireddypalem - Sakshi

బుచ్చిరెడ్డి పాలెం: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పార్వతి అనే మహిళ తన ఇద్దరు పిల్లల్ని బావిలోకి తోసేసి ఆ తర్వాత తానూ దూకింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందగా..స్థానికులు గమనించి పార్వతిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పార్వతి ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top