
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తిరువూరు నగర పంచాయతీలోని భగత్‌సింగ్‌లో నగర్‌లో బాలుడిపై అత్యాచారం జరిగింది. ఆరేళ్ల బాలుడిపై ఇద్దరు మైనర్ యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలుడు కేకలు వేయడంతో యువకులు పరారయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలడ్ని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.