పదో తరగతి బాలికకు గర్భం.. 

Molestation Attack On Tenth Class Girl Student - Sakshi

స్నేహితురాలి వద్దకు వచ్చే బాలికకు వలేసి వంచించిన యువకుడు

గుంటూరు పోలీస్‌ గ్రీవెన్స్‌లో బాధితురాలి ఫిర్యాదు  

గుంటూరు: తన చెల్లెలి దగ్గరికొచ్చే పదో తరగతి బాలికకు (15)కు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడో దుర్మార్గుడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని ఓ గ్రామంలో బాలిక సమీపంలోని జిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి తరచూ వెళ్లి పుస్తకాలు తెచ్చుకునేది. అదే అవకాశంగా భావించిన స్నేహితురాలి సోదరుడు గుంజి నరేంద్ర (23) బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి లైంగిక దాడి చేశాడు. ఇది నిందితుడి కుటుంబ సభ్యులకు తెలియగా.. తమ కుమారుడితో పెళ్లి జరిపిస్తామని, విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ బాలికను నమ్మించారు. దీన్ని అలుసుగా తీసుకున్న యువకుడు బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ నేపథ్యంలో బాలిక గర్భవతి అయింది. రోజు రోజుకూ తమ కుమార్తెలో మార్పులు వస్తుండటాన్ని గమనించిన బాలిక తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించి చేతులు దులుపుకొన్నారు. అయితే తమ కూతురిపై లైంగికదాడికి ప్రోత్సహించిన నిందితుడి తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బాధిత బాలిక, కుటుంబ సభ్యులతో కలసి సోమవారం గుంటూరు పోలీస్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. నిందితులందరిని జైలుకు పంపితేనే మరొకరికి తనలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉంటుందని బాధిత బాలిక కన్నీటి పర్యంతమైంది. కాగా, నిందితుడు గుంజి నరేంద్ర ఐటీఐ పూర్తి చేసి తాపీ పనులకు వెళ్తాడని తెలిసింది.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top