మైనర్‌ బాలిక కిడ్నాప్, పెళ్లి | Minor Girl Kidnapped And Child Marriage In Tamil nadu | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలిక కిడ్నాప్, పెళ్లి

Jul 20 2018 7:15 AM | Updated on Jul 20 2018 7:15 AM

Minor Girl Kidnapped And Child Marriage In Tamil nadu - Sakshi

నిందితుడు కలైయరసన్‌ (ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, చెన్నై: మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి, పెళ్లి చేసుకున్ని యువకుడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఈరోడ్‌ జిల్లా సురుంగల్‌పాళెంకు చెందిన బేల్దారి మేస్త్రీ కుమార్తె (17) అదే ప్రాంతంలోని ఒక ప్రయివేటు మిల్లులో పనిచేస్తోంది. ధర్మపురి జిల్లా అరూరుకు చెందిన కలైయరసన్‌ (20) ఇదే మిల్లులో పనిచేస్తున్నాడు. ఇరువురూ ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మిల్లులో ఉద్యోగం మాన్పించి ఈరోడ్‌ మణికూండులోని ఒక దుకాణంలో పనికి పెట్టారు.

ఈనెల 10వ తేదీన కలైయరసన్‌ బాలికకు ఫోన్‌చేసి సురుంగల్‌పాళయం బస్‌స్టాండుకు పిలిపించుకున్నాడు. బాలికను మభ్యపెట్టి బస్సులో సేలంకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. కుమార్తె కనపడడం లేదని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు సమాచారాన్ని అన్ని మహిళా పోలీస్‌స్టేషన్లకు పంపారు. కేరళ రాష్ట్రం పాలక్కాడు సమీపం బిక్కిలి గ్రామంలో ఉన్నట్లు కనుగొన్న తమిళనాడు పోలీసులు గురువారం ఇద్దరిని ఈరోడ్‌కు తీసుకొచ్చారు. మైనర్‌ బాలికను కిడ్నాప్‌చేసి, పెళ్లి చేసుకుని లైంగిక దాడికి పాల్పడినట్లుగా కలైయరసన్‌పై పొక్సో చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement