ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య | Married Woman Commits Suicide | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య

May 2 2018 6:51 AM | Updated on Nov 6 2018 8:16 PM

Married Woman Commits Suicide - Sakshi

ఏరియా వైద్యశాలలో ఉన్న అంకితశ్రీ మృతదేహం

బాపట్లటౌన్‌: ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం పట్టణంలోని ఎస్‌ఎన్‌పి అగ్రహారంలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి కథనం ప్రకారం పట్టణంలోని 14వవార్డు, ఎస్‌ఎన్‌పీ అగ్రహారానికి చెందిన మోకా అంకితశ్రీ కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అంకితశ్రీని అదే ప్రాంతానికి చెందిన మోకా వెంకటేష్‌వర్మతో రెండేళ్ల క్రితం వివాహం చేశారు. వీరి ఇద్దరికి కుటుంబంలో తలెత్తిన వివాదాల కారణంగానే ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement