పద్నాలుగేళ్ల బాలికకు వివాహం | Married to a fourteen-year-old girl | Sakshi
Sakshi News home page

పద్నాలుగేళ్ల బాలికకు వివాహం

Mar 20 2018 12:31 PM | Updated on Mar 20 2018 12:31 PM

Married to a fourteen-year-old girl - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరుమలగిరి (తుంగతుర్తి) : పద్నాలుగేళ్ల బాలికకు వివాహం చేసిన తల్లిదండ్రిపై తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ షమీమ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన ఇట్యబోయిన లింగయ్య, పద్మ కూతురు ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆ బాలికకు జనగామ జిల్లా పాకాలకు చెందిన యువకుడితో నాలుగురోజుల క్రితం వివాహం జరిపించారు.

అయితే గతంలో బాలికకు వివాహం నిశ్చయం కాగా, తల్లిదండ్రికి కౌన్సిలింగ్‌ ఇచ్చి హామీ పత్రం కూడా తీసుకున్నామని తెలిపారు. అయినా వారు వివాహం చేయడంతో సమాచారం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. బాలికలకు వివాహం జరిపితే బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement