అరకు దాడిలో పాల్గొన్న మావోయిస్టులు వీరే..

Maoists Details Related To Kidari Sarveswara Rao Murder - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చిన మావోయిస్టులలో ముగ్గురిని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారు సోమవారం వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కిడారి, సోమలపై దాడిలో పాల్గొన్న వారు ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

స్థానికుల సాయంతో ముగ్గురు మావోయిస్టులను గుర్తించిన పోలీసులు వారికి సంబంధించిన వివరాలతో పాటు ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. అంతేకాకుండా జిల్లా పోలీసులు, ప్రత్యేక బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ తెలియజేశారు. కాగా, డుంబ్రిగుడ మండలం తొట్టంగి వద్ద కిడారి, సోమలపై దాడి జరిపిన వారిలో సాయుధులైన మహిళా మావోయిస్టులే ఎక్కువగా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

పోలీసులు వెల్లడించిన వివరాలు:
1. వెంకట రవి చైతన్య అలియాస్‌ అరుణ, గ్రామం కరకవానిపాలెం, మండలం పెందుర్తి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
2. కామేశ్వరి అలియాస్‌ స్వరూప, సీంద్రి చంద్రి, రింకీ- భీమవరం టౌన్‌, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్‌
3. జలమూరి శ్రీనుబాబు అలియాస్‌ సునీల్‌, రైనో - గ్రామం దబ‍్బపాలెం, అడ్డతీగల పోలీసు స్టేషన్‌ పరిధి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top