breaking news
Rahuldev Sharma
-
వైఎస్ వివేకా హత్య కేసు ఛేదనకు 12 బృందాలు
సాక్షి కడప/అర్బన్: దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించేందుకోసం 12 బృందాలు పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ చెప్పారు. ఆదివారం రాత్రి డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్య కేసును సీఐడీ అడిషనల్ డీజీ అమిత్‌గార్గ్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు పర్యవేక్షిస్తున్నాయని, ఇందులో సిట్ ఆధ్వర్యంలో ఐదు బృందాలు పనిచేస్తుండగా, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏడు బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. వివేకానందరెడ్డి ఈ నెల 15వ తేదీ రాత్రి 11.30 గంటలకు పులివెందులలోని తన స్వగృహానికి వచ్చారని, ఇంటికి రాగానే డ్రైవర్‌ను పంపించి నిద్రపోయారన్నారు. తెల్లవారేసరికి ఆయన హత్యకు గురయ్యారని, ఈ నేపథ్యంలో ఆయన నిద్రకు ఉపక్రమించినప్పటి నుంచి మరుసటిరోజు ఉదయం 5.30 గంటల్లోపు ఏం జరిగి ఉంటుందనే దానిపై పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సిట్ బృందం పలుమార్లు నేర స్థలాన్ని పరిశీలించిందని, వైఎస్ వివేకా కుటుంబసభ్యులతోపాటు సోదరులను కూడా విచారించినట్లు తెలిపారు. హత్య జరిగిన రోజు ఉదయాన్నే డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంలతో సమగ్రంగా విచారించి ఆధారాలు సేకరించామన్నారు. కేసును సిట్‌కు అప్పజెప్పడంతో అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు 20 మంది సాక్షులను విచారించామన్నారు. ఈ కేసులో ఫింగర్ ప్రింట్ బ్యూరో, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సేవల్నీ వినియోగించుకుంటున్నామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా బృందాలతో రంగంలోకి దిగి ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అనుమానితులపై నిఘా ఉంచామని, జిల్లావ్యాప్తంగా సమాచార సేకరణ జరుగుతోందని తెలిపారు. అలాగే ఫోరెన్సిక్ సాంకేతిక సాక్ష్యాలకోసం బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. లెటర్‌కు సంబంధించి శ్యాంపిల్ హ్యాండ్‌రైటింగ్‌ను కూడా పరిశీలించి ఫోరెన్సిక్‌కు పంపినట్లు తెలిపారు. -
మావోయిస్టులను గుర్తించిన పోలీసులు
-
అరకు దాడిలో పాల్గొన్న మావోయిస్టులు వీరే..
సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చిన మావోయిస్టులలో ముగ్గురిని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారు సోమవారం వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కిడారి, సోమలపై దాడిలో పాల్గొన్న వారు ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికుల సాయంతో ముగ్గురు మావోయిస్టులను గుర్తించిన పోలీసులు వారికి సంబంధించిన వివరాలతో పాటు ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. అంతేకాకుండా జిల్లా పోలీసులు, ప్రత్యేక బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ తెలియజేశారు. కాగా, డుంబ్రిగుడ మండలం తొట్టంగి వద్ద కిడారి, సోమలపై దాడి జరిపిన వారిలో సాయుధులైన మహిళా మావోయిస్టులే ఎక్కువగా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాలు: 1. వెంకట రవి చైతన్య అలియాస్ అరుణ, గ్రామం కరకవానిపాలెం, మండలం పెందుర్తి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 2. కామేశ్వరి అలియాస్ స్వరూప, సీంద్రి చంద్రి, రింకీ- భీమవరం టౌన్, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్ 3. జలమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, రైనో - గ్రామం దబ్బపాలెం, అడ్డతీగల పోలీసు స్టేషన్ పరిధి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్ -
ఏఓబీలో ముమ్మరంగా గాలింపు
కొమరాడ: ఏఓబీలో ప్రత్యేక బలగాలు ముమ్మరంగా గాలింపుచర్యలు చేపడుతున్నట్లు పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ అన్నారు. గురువారం ఆయన కొమరాడ పోలీసుస్టేషన్‌ను అకస్మికంగా పరిశీలించారు. ముందుగా స్టేషన్లో రికార్డులను పరిశీలించి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఓబీలో అప్రమత్తంగా ఉంటూ గాలింపుచర్యలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ పోలీసు స్టేషన్వద్ద ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఏఓబీలో ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. కార్యక్రమంలో ఆయనతోపాటు సీఐ బి. వెంకట్రావు, ఎస్సై ధర్మేంద్ర, సిబ్బంది ఉన్నారు. -
ప్రశాంతంగా సిరిమానోత్సవం
విజయనగరం క్రైం: పైడితల్లమ్మ సిరిమానోత్సవం మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి పోలీ సులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం పూట పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించా రు. ప్రతి క్యూలైన్‌ను పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ స్వయంగా పరిశీలించి భక్తులకు ఎటువంటి ఇబ్బందు లు తలెత్తకుండా చేశారు. పైడితల్లమ్మ గుడి వద్ద విజయనగరం డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్, అడిషనల్ ఎస్పీ ఎ.రమణ బందోబస్తును పర్యవేక్షించారు. సిరిమాను తిరిగే పైడితల్లమ్మ గుడి నుంచి కోట వరకు సుమారు 500 మంది సిబ్బందిని నియమించారు. సిరిమాను తిరగక ముందు ఒకసారి ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్, రెండుసార్లు అదనపు ఎస్పీ ఎ.వి.రమణ సిరిమాను తిరిగే ప్రాంతంలో ఉన్న బందోబస్తును పర్యవేక్షించారు. సిరిమాను తిరిగే ప్రాంతమంతా పోలీసు బలగాలను మొహరించారు. సిరిమాను తిరగక ముందు ఎస్పీ సిరిమాను వద్ద ఉండగా, అడిషనల్ ఎస్పీ కోట వద్ద ఉండి బందోబస్తును పరిశీలించారు. పైడితల్లమ్మ గుడి వెనుక భాగంలో భక్తులు బారీకేడ్లుపై పడి ముందుకు రావడానికి ప్రయత్నించడంతో పోలీసులు నిలువరించారు. గురజాడ అప్పారావు రోడ్డులో ఆకతాయిలు మహిళలపై పడడంతో పోలీసులు వారిని తరిమారు. కొన్ని సందర్భాలలో భక్తులు సిరిమాను తిరిగే ప్రాంతంలోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు నిలువరించారు.మొత్తంగా ప్రశాంతంగా సిరిమానోత్సవం ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్పీని గార్డులతో మూసిన పోలీసులు సిరిమాను మొదటిసారి తిరిగిన సమయంలో ఎస్పీ నవదీప్సింగ్గ్రేవాల్ కోట వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో సిరిమాను కోట వద్దకు రావడంతో భక్తులు అరటిపళ్లను పూజారిపై విసిరారు. ఈ సమయంలో ఎస్పీకి సెక్యూరిటీగా వచ్చిన సిబ్బంది గార్డులతో ఆయనను మూసి భద్రతగా నిలిచారు. సిరిమానోత్సానికి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. పట్టణంలోకి వచ్చే వాహనాలు, ట్రాఫిక్ ఆంక్షలను పక్కాగా అమలు చేయడంలో పోలీసులు సఫలీకృతులయ్యూరు. విజయనగరం మున్సిపాలిటీ: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి సిరిమానోత్సవం సందర్భంగా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సహాయ, సహాకారాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను మొత్తం లక్షన్నర మంది సందర్శించారు. మూడు లక్షల రూపాయల వ్యయంతో స్థానిక మహారాజ సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సోమ, మంగళవారాల్లో భక్తుల సందర్శనార్ధం ఏర్పాటు చేశారు. ఇందు లో భాగంగా తొలేళ్లు జరిగిన సోమవారం సుమారు లక్ష మంది భక్తులు సందర్శనకు వచ్చినట్లు అధికారు లు అంచనా వేస్తుండగా సిరిమానోత్సవం జరిగిన మంగళవారం మరో 50 వేల మంది సందర్శించినట్లు చెబుతున్నారు. తొలి రోజు ప్రదర్శనలో ఉంచిన బౌన్సా యి మొక్కలు, గ్లాస్ పెయింటింగ్స్, బుద్ధుడు, వినాయక విగ్రహాలు, కూరగాయలతో చేసిన వివిద ఆకృతుల ప్రదర్శనలు, అమ్మవారి సైకత శిల్పం ప్రదర్శనల్లో ఎటువంటి మార్పు లేకపోగా... ఐస్‌తో తయారు చేసిన వినాయక ప్రతిరూపం అందరినీ ఆకట్టుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఆయా శాఖల పరంగా లబ్ధిదారులకు సబ్సిడీపై అందజేసే ఉత్పత్తులను రెండవ రోజు ప్రదర్శనలో కొనసాగించారు. ఈ ప్రదర్శనను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎన్.మోహనరావు, జిల్లా ఉద్యానశాఖ సహాయ సంచాలకులు పి.లక్ష్మణప్రసాద్ పర్యవేక్షించారు. కిక్కిరిసిన ఆర్టీసీ కాంప్లెక్స్ విజయనగరం అర్బన్: జిల్లా ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి పండుగ ఆర్టీసీకి సందడి తెచ్చింది. మూడు రో జులుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికుల రాకపోకలతో రద్దీ నెలకొంది. భక్తులకు రవాణా సేవలందించడంతో పాటు ఆదాయాన్ని తెచ్చుకొనే ప్రయత్నంలో ఆర్టీసీ అధికారులు నానాయాతన పడ్డారు. పార్వతీపురం, సాలూ రు, విశాఖ, శ్రీకాకుళం, పాలకొండ డిపోల అధికారులు, సిబ్బంది ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లోని ఆవరణలో విధులు నిర్వహించి సంబంధిత డిపో బస్సుల్లో ప్రయాణికులను దగ్గరుండి ఎక్కించి సేవలందించారు. దీంతో కాంప్లెక్స్ ప్రయాణికులతో కళకళలాడింది. భక్తులకు అందుబాటు లో సర్వీసులను అందజేస్తూ సంస్థకు ఆదాయాన్ని చేకూర్చడానికి ఆర్టీసీ అధికారులు కృషిచేశారు. జిల్లాలోని వివి ధ డిపోలనుంచి 150సర్వీసులను అదనంగా ఏర్పాటుచేసి సేవలను అందుబాటులో ఉంచారు. ప్రధానంగా విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, పాలకొండ, సాలూరు, పార్వతీ పురం వైపు ఏర్పాటు చేసిన సర్వీసుల నుంచి ప్రయాణికు ల రాకపోకలు అధికంగా సాగాయి. పట్టణానికి వచ్చిన బస్సులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రద్దీగా ఉ న్నాయి. సిరిమానోత్సవం తరువాత తిరుగు ప్రయాణం చేసే ప్రయాణికులు పెరిగారు. సాయంత్రానికి ప్రయాణికుల రద్దీ పెరిగింది. బుధ, గురువారాలలో కూడా తిరుగు ప్రయాణ సర్వీసులను అందుబాటులో ఉంచుతామని డి ప్యూటీ సీటీఎం కె.శ్రీనివాసరావు తెలిపారు. సర్వీసుల ఏ ర్పాటులో ఆర్ఎం అప్పన్న, జోనల్ ఈడీ కార్యదర్శి వేణుగోపాల్, విజయనగరం డిపో మేనేజర్ పద్మావతి, స్టేషన్ మాస్టర్ రమేష్ తదితరులు తమ విధులు నిర్వహించారు.