ఏఓబీలో ప్రత్యేక బలగాలు ముమ్మరంగా గాలింపుచర్యలు చేపడుతున్నట్లు పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ అన్నారు.
కొమరాడ: ఏఓబీలో ప్రత్యేక బలగాలు ముమ్మరంగా గాలింపుచర్యలు చేపడుతున్నట్లు పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ అన్నారు. గురువారం ఆయన కొమరాడ పోలీసుస్టేషన్‌ను అకస్మికంగా పరిశీలించారు. ముందుగా స్టేషన్‌లో రికార్డులను పరిశీలించి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఓబీలో అప్రమత్తంగా ఉంటూ గాలింపుచర్యలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ పోలీసు స్టేషన్‌వద్ద ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఏఓబీలో ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. కార్యక్రమంలో ఆయనతోపాటు సీఐ బి. వెంకట్రావు, ఎస్సై ధర్మేంద్ర, సిబ్బంది ఉన్నారు.