పాతకక్షలతో మర్మాంగాన్ని కోశాడు | man cut penis | Sakshi
Sakshi News home page

పాతకక్షలతో మర్మాంగాన్ని కోశాడు

Mar 4 2018 6:18 PM | Updated on Oct 16 2018 3:15 PM

man cut penis - Sakshi

బాధితుడు రవీందర్‌

నంగునూరు(సిద్దిపేట): పాత కక్షలతో మతిస్థిమితం సరిగాలేని వ్యక్తి మర్మాంగాన్ని కోసిన ఘటన నంగునూరు పరిధిలోని రాంచంద్రాపూర్‌లో జరిగింది. మూడు రోజుల కింద జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం..రామచంద్రాపూర్‌కు చెందిన మతిస్థిమితం సరిగా లేని పందిల్ల రవీందర్‌రెడ్డిని అదే గ్రామానికి చెందిన నారాయణరెడ్డి మూడు రోజుల కిందట ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి పురుషాంగాన్ని కత్తితో కోశాడు.

తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు రవీందర్‌రెడ్డిని సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మొదట పరిహారం ఇస్తానని చెప్పిన నారాయణరెడ్డి తరువాత మాటమార్చడంతో శనివారం బాధితుడి బంధువు నాయిని రాజిరెడ్డి రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement