వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం | Man Attempt To Suicide | Sakshi
Sakshi News home page

వడ్డీ వ్యాపారుల వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Apr 9 2018 10:32 AM | Updated on Aug 29 2018 8:38 PM

Man Attempt To Suicide - Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవికుమార్‌

విశాఖక్రైం: బలవంతపు వడ్డీలు కట్టలేక నగరంలోని రైల్వేన్యూకాలనీకి చెందిన సీహెచ్‌ రవికుమార్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే కుటుంబ సభ్యులు గమినించడంతో చికిత్స కోసం అతన్ని కేజీహెచ్‌కు తరలించారు.

బాధితుడి కథనం మేరకు

రైల్వేన్యూకాలనీకి చెందిన సీహెచ్‌ రవికుమార్‌ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. కాలనీలో భార్య, ఇద్దరు కుమార్తెలతో నివాసముంటున్నా డు. 2013లో గోపాలపట్నానికి చెందిన పోర్టు ఉద్యోగి మురళీ దివాకర్‌రెడ్డి, సిరిపురానికి చెం దిన శంకరరావుల వద్ద రూ.లక్ష అప్పుతీసుకున్నాడు.వారు వడ్డీ కోసం వేధించడంతో శనివారం రాత్రి నిద్రమాత్రలు మింగాడు.

విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని కేజీహెచ్‌కు తరలించారు.  కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రవికుమార్‌ మాట్లాడుతూ వడ్డీ వ్యాపారులు మురళీ దివాకర్‌రెడ్డి, శంకరరావులు తనను వేధిస్తున్నారని ‘సాక్షి’కి వివరించారు.

వారి వద్ద 2013లో రూ. లక్ష అప్పుగా తీసుకోవడం జరిగిందన్నారు. అందుకు షూరిటీగా రూ.లక్ష చెక్కును వారికి అందజేసినట్లు వివరించారు. అనంతరం 2014లో రూ. లక్ష తిరిగి వారికి ఇవ్వడం జరిగిందన్నారు.

అయితే దివాకర్‌రెడ్డి, శంకరరావులు మరో లక్షరూపాయాలు వడ్డీ అయ్యిందని చెప్పి  చెక్కు తిరిగి ఇవ్వలేదని, దీంతో పాటు మరిన్ని డబ్బులు చెల్లించాలని బెదిరింపులకు దిగిరాని తెలిపారు. దీంతో పాటు తనకు తాళ్లవలసలో ఉన్న 80 గజాల స్థలాన్ని, అమ్మంచి డబ్బులు కాజేశారని రవికుమార్‌ వెల్లడించాడు.

సింహాచలంలో ఉన్న 330 గజాల స్థలాన్ని రాయించుకున్నారని తెలిపాడు.అయినా ఇంకా డబ్బులు చెల్లించకపోతే చంపేస్తామని హెచ్చరిస్తున్నారని అతను ఆరోపించారు. వారి వేధింపులు భరించలేక  శనివారం రాత్రి నిద్రమాత్రలు మింగినట్లు వెల్లడించారు.  పోలీసులు చొరవతీసుకొని తనకు న్యాయం చెయ్యాలని రవికుమార్‌ కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement