వరుస కాదు‘అ’న్నా వినడే..! | lover protest at police station due to love issue | Sakshi
Sakshi News home page

వరుస కాదు‘అ’న్నా వినడే..!

Jan 11 2018 8:04 PM | Updated on Jan 11 2018 10:41 PM

lover protest at police station due to love issue - Sakshi

సాక్షి, బెంగళూరు: ప్రేమించిన యువతి సోదరి అవుతుందని పెద్దలు, పోలీసులు చెప్పినా ఆ యువకుడు పట్టించుకోలేదు. ఆ యువతితోనే తనకు వివాహం జరిపించాలని డిమాండ్‌ చేస్తూ పోలీస్‌స్టేషన్‌ ముందు ధర్నాకు దిగాడు. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్‌కోటే పోలీస్‌స్టేషన్‌ వద్ద గురువారం చోటుచేసుకుంది. బాగల్‌కోటే తాలూకా నవనగర నివాసి సాగరసుగతేకర అనే యువకుడు ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని గత 12 నెలలుగా ప్రేమిస్తున్నాడు. 

ఈ విషయంపై యువతి కుటుంబ సభ్యులు ఆరా తీయగా అతడు అన్న వరుస అవుతాడని గుర్తించి వారి వివాహానికి నిరాకరించారు. అంతేగాక సాగరసుగతేరపై బాగల్‌కోటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతికి దూరంగా ఉండాలని ఆ యువకుడిని పోలీసులు హెచ్చరించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని సాగరసుగతేకర గురువారం పోలీస్‌స్టేషన్‌ ముందు ధర్నాకు దిగాడు. తాను ప్రేమించిన అమ్మాయిని అప్పగించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సాగరసుగతేకరను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement